Cow is like god: గోమాతలు తమ జీవితంలో భాగమంటోన్న ఆదీవాసీలు

Cow is like God: ఆవులే వారి ఆరాధ్య దైవం. ఆ ఆవులనే ప్రతి నిత్యం కులదైవంగా కొలుస్తారు. వాటి నుండి వచ్చే పాలను అమృతంలా భావిస్తారు.

Update: 2020-06-26 05:32 GMT

ఆవులే వారి ఆరాధ్య దైవం. ఆ ఆవులనే ప్రతి నిత్యం కులదైవంగా(Cow is like God) కొలుస్తారు. వాటి నుండి వచ్చే పాలను అమృతంలా భావిస్తారు. డబ్బులు ఇస్తామన్న వాటిని ఇతరులకు అమ్మరు. ఆవులను దేవతలుగా ఆరాదిస్తోన్నా గిరిజనులపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.

ఆదివాసీల జిల్లాగా ప్రసిద్ధి పొందింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అక్కడ వందలాది గిరిజన గూడాలు ఉంటాయి. గూడేలోని ప్రతి ఇంట్లో కనీసం పదేసి ఆవులుంటాయి. ఆ ఆవులే వారికి జీవనాధరం. వాటిని లక్ష్మిదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. నిత్యం మంగళ హారతులతో పూజిస్తారు. అలా గోమాతలను పూజించడం వలన అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు లభిస్తాయనేది వారి ప్రగాఢ విశ్వాసం.

ఒక్కో ఆవు లీటర్ల కొద్ది పాలను ఇస్తున్నా వాటిని ఇతరులను అమ్మడం అనేది అక్కడ కనబడదు. వారి ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి కానుకగా ఆవులను కూడా ఇస్తామని చెప్తున్నారు. అలా ఇవ్వడం వలన లక్ష్మిదేవి కటక్షం ప్రాప్తిస్తుందని వారి నమ్మకం.

గోమాతలకు పుట్టే లేగ దూడలను ఎద్దులుగా తయారుచేసి వ్యవసాయానికి వినియోగిస్తున్నామని..అవే వారికి పేదవాడి ట్రాక్టర్లుగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఆవు పేడను ఎరువులుగా ఉపయోగిస్తూ అలా చేయడం వలన ఎక్కువ దిగుబడితో పాటు పంటలకు ఎలాంటి రసాయనాల బెడద ఉండదంటోన్నారు. మొత్తానికి గోమాతలు తమ జీవితంలో భాగమని నిత్యం వాటినే కొలుస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.   


Full View


Tags:    

Similar News