Hyderabad: హైదరాబాద్‌లో వేగంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

* విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారికి టీకాలు * 28 రోజుల వ్యవధిలో కోవిషీల్డ్‌ రెండు డోసులు

Update: 2021-08-18 04:15 GMT

కరోనా వాక్సినేషన్ (ఫైల్ ఫోటో)

Vaccination in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు ఇస్తుండగా, ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పాస్‌పోర్ట్‌, వర్క్‌ పర్మిట్‌, వీసాలను చూపించి వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో టీకా పొందొచ్చని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిషీల్డ్‌ టీకాలను 28 రోజుల వ్యవధిలో రెండుడోసులు ఇవ్వనున్నారు.

విదేశాలకు వెళ్లే వారు తప్పనిసరిగా రెండుడోసులు తీసుకోవాలని గైడ్‌లైన్స్‌ విడుదలైంది. అదికూడా అధికారికంగా రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలి చెబుతున్నారు అధికారులు. కాగా కోవిన్‌ వెబ్‌సైట్‌లో కోవిషీల్డ్‌ ఫస్ట్‌ వేసుకున్న తర్వాత రెండోడోస్‌ కోసం 84 రోజులు ఆగాల్సి ఉంది. అయితే 84 రోజులకు ముందే విదేశాలకు వెళ్లాల్సిన వారు ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తున్నారు.

Tags:    

Similar News