Coronavirus Fake Medicine: కరోనా మందు బ్లాక్ మార్కెట్ దందా గుట్టురట్టు

Coronavirus Fake Medicine: కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, మరో వైపు కొంత మంది వ్యక్తులు ఈ పరిస్థితిని అదునుగా భావించి బాధితుల ప్రాణాలను క్యాష్ చేసుకుంటున్నారు.

Update: 2020-07-14 16:30 GMT

Coronavirus Fake Medicine: కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, మరో వైపు కొంత మంది వ్యక్తులు ఈ పరిస్థితిని అదునుగా భావించి బాధితుల ప్రాణాలను క్యాష్ చేసుకుంటున్నారు. కంటికి కనిపించని కోరిన వైరస్ కి మందు లేక ఇబ్బందులుపడుతున్న సమయంలో బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న కొన్ని మందులకు వ్యాపారులు ధరలు పెంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అలాంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బ్లాక్ మార్కెట్ లో అంత‌రాష్ట్ర ముఠా ఈ దందా నిర్వ‌హిస్తున్నారు. కాగా వారిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో వున్న ప్రధాన నిందితుడు వెంకట సుబ్ర‌హ్మ‌ణ్యం తో పాటు మ‌రికొంత‌మందిని పోలీసులు అరెస్ట్ చేసారు.

పాతబస్తీకి చెందిన మెడికల్ వ్యాపారి వెంకట సుబ్రహ్మణ్యం మార్కెట్ లోకి వచ్చిన ఓ మందును బ్లాక్ చేశాడు. అంతే కాక వాటిని బాధితులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సేల్స్ రిప్ర‌జంటేటర్ల ద్వారా భారీ ఎత్తున అమ్మ‌కాలు జరుపుతున్నాడు. సేల్స్ రిప్ర‌జంటేటర్ల తో మాట్లాడి సుమారు రూ.15,000 కమీషన్ ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. సాధారణంగా10వేల విలువ‌ చేసే మందులను బ్లాక్ మార్కెట్ లో 40వేల నుంచి 50వేల వ‌ర‌కు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం పై స‌మాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వ‌హించారు.

ఈ దాడుల్లో వారి నుంచి రూ.35.5ల‌క్ష‌ల విలువ చేసే మెడిసిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఈ ముఠా నుండి కోవిఫీర్, 51 ఇంజక్షన్లు, అక్తిమ్రా 4 ఇంజక్షన్లు, అస్తి మ్రా 9 ఇంజక్షన్లు, ఫిబి ఫ్లూ 180 ఎంజి క‌రోనా ర్యాపిడ్ కిట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంగారెడ్డి హెటిరో కంపెనీలో త‌యారు చేస్తున్న ఈ మెడిసిన్ ను.. మార్కెట్ లో షార్టేజీ ఉందంటూ ప్ర‌జ‌ల్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టామన్నారు.


Full View

 

Tags:    

Similar News