భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటుబాంబు కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటుబాంబు కలకలం రేపింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటు బాంబు పేలడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటుబాంబు కలకలం రేపింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటు బాంబు పేలడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. రైలు పట్టాల పక్కన బాంబు పడి ఉండగా.. ఓ కుక్క ఆ సంచిని కొరకడంతో పేలిపోయింది. ఘటనలో అక్కడికక్కడే కుక్క మృతి చెందింది. భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. నాటుబాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. పట్టాలపై బాంబు ఎవరు పడేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.