తెలంగాణలో కొత్తగా రెండు పాజిటివ్ కేసులు..
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ తాజాగా రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలోనే రెండు కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు 1003 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసులు కూడా ఈ రోజు నమోదు కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా 646 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 332మంది బాధితులు కోలుకున్నారు. ఇవాళ మరో 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 26 మంది మృతి చెందారు. హైదరాబాద్ లోనే ఇప్పటివరకు 544 కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నేళ్లలోనే తెలంగాణలో కరోనా కేసులు లేని రాష్ట్రంగా నిలుస్తుందని కేసిఆర్ అన్నారు. 24 జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదని కేసిఆర్ అన్నారు. కేసులు తగ్గిన అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్ డౌన్ వల్ల కేసులు తగ్గుతున్నాయని కేసిఆర్ అభిప్రాయపడ్డారు.