తెలంగాణలో 1,107కి చేరిన పాజిటివ్ కేసులు...
తెలంగాణలో ఇవాళ 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇవాళ 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,107కి చేరింది. కరోనా నుంచి 20 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
వీరితో కలిపి మొత్తంగా 648 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో 430 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. ఇవాళ కొత్తగా నమోదు అయిన జీహెచ్ఎంసీ పరిధిలోనే 11 కేసులు నమోదయ్యాయి.