నిర్మాణ రంగం.. అనుబంధిత వ్యాపారాలకు అనుమతి : సీఎం కేసీఆర్

కరోనా రాష్ట్రంలో అదుపులో ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా కట్టడికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని అన్నారు. అన్ని జిల్లాలో నైట్ కర్ఫ్యూ

Update: 2020-05-05 16:51 GMT
KCR (File Photo)

సుదీర్ఘ క్యాబినెట్ మీటింగ్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. కరోనా రాష్ట్రంలో అదుపులో ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా కట్టడికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని అన్నారు. అన్ని జిల్లాలో నైట్ కర్ఫ్యూ రాత్రి ఏడూ నుంచి ఉదయం వరకు ఉంటుందని వెల్లడించారు. ఇక వ్యవసాయ సంబంధించిన వస్తువులకి అనుమతి షాపులు, గృహనిర్మాణ, ఎలక్ట్రిక్ షాపులు, సిమెంట్ షాపులు తెరిచి ఉంటాయని కేసీఆర్ వెల్లడించారు. అయితే రెడ్ జోన్ లలో వీటికి అనుమతి లేదని కేసీఆర్ వెల్లడించారు.

ఇక తెలంగాణలో ఈరోజు 11 కేసులు నమోదు అయ్యాయని, 43మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 1096 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనాతో పోరాడి 628 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.

Tags:    

Similar News