MLC Kavitha: నిజామాబాద్‌లో త్వరలో ఐటీ హబ్ నిర్మాణం
MLC Kavitha: రూ.50 కోట్లతో ఐటీ హబ్ భవన నిర్మాణం
MLC Kavitha: నిజామాబాద్‌లో త్వరలో ఐటీ హబ్ నిర్మాణం
MLC Kavitha: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో నిర్మాణమవుతున్న ఐటి హబ్ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరిశీలించారు. నిజామాబాద్‌లో త్వరలోనే ఐటీ హబ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఐటి హబ్‌లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధికి అవకాశం లభిస్తుందన్నారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్‌కు రానున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.