Bhatti Vikramarka: దొరల తెలంగాణా కావాలా.. ప్రజల తెలంగాణా కావాలా ?
Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలవబోతున్నాము
Bhatti Vikramarka: దొరల తెలంగాణా కావాలా.. ప్రజల తెలంగాణా కావాలా ?
Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారంలో మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భట్టి .. ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలన్నారు. దొరల తెలంగాణా కావాలా , ప్రజల తెలంగాణా కావాలా తేల్చుకునే ఎన్నికలని అన్నారు. BRS పార్టీని దించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలనేది ప్రజల్లో ఉందని అన్నారు .
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మధిర అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్తామని,రైతులకు నీటి సమస్య తీర్చడం కోసం శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలవబోతున్నామని తెలియజేశారు. ఈనెల ముప్పైన జరిగే ఎన్నికల్లో ప్రజలు హస్తం గుర్తు పై ఓటేసి గెలిపించాలని కోరారు.