Revanth Reddy: రేవంత్‌ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్‌

Revanth Reddy: సోనియా, రాహుల్‌, ప్రియాంకకు స్వాగతం పలికిన..రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావ్‌ థాక్రే, శ్రీధర్‌బాబు

Update: 2023-12-07 05:24 GMT

Revanth Reddy: రేవంత్‌ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్‌

Revanth Reddy: ఇవాళ తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులుగా 10 మంది ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే ఎమ్మెల్యేలకు ఫోన్‌లు చేసి సమాచారం ఇస్తున్నారు. ఇప్పటి వరకు 12 మందికి ఫోన్‌లు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మంత్రివర్గంలో అవకాశం ఉండబోదని తెలుస్తోంది. ఇక దామోదర రాజనర్సింహకు మాణిక్‌రావు ఠాక్రే ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఈ మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కాసేపటి క్రితం రేవంత్‌రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర అగ్రనేతలకు రేవంత్‌రెడ్డి విమానాశ్రయంలో స్వయంగా ఆహ్వానం పలికారు. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న ఎల్బీ స్టేడియంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం 3 గంటలకు రేవంత్ సెక్రటేరియట్‌కు వెళ్తారు.

Tags:    

Similar News