కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను నేడు విచారించేందుకు హైకోర్టు అంగీ కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.
ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీలో విలీనం చేసే వ్యవ హారం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని వ్యవహారమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. 10వ షెడ్యూ ల్ ప్రకారం ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్ పరిధిలోని అంశం కాదన్నారు. శాసనసభాపక్ష పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు ఉండదని విలీన ప్రక్రియ ఆపాలని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.