V Hanumantha Rao: యాసంగి పంట కొనుగోలు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు
V Hanumantha Rao: ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయి
V Hanumantha Rao: యాసంగి పంట కొనుగోలు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు
V Hanumantha Rao: ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయన్నారు మాజీ రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు. యాసంగి పంట కొనుగోలు కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. ధాన్యం ప్రభుత్వం కొంటేనే న్యాయం జరుగుతుందన్నారు. లేకపోతే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. దళిత బంధు, రైతు బంధు ఇస్తున్న కేసీఆర్ రైతుల గోడు పట్టించుకుని ధాన్యం కొనుగోలు చేయాలన్నారు వీహెచ్.