Revanth Reddy: రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఆందోళన
* ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు
రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఆందోళన
Revanth Reddy: రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగనుంది. పనితీరును ఎండగడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపట్టనుంది. రైతు సమస్యలే ప్రధాన ఏజెండాగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొంటారు. ధరణి సమస్యలు పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, పోడు భూములు, ఎసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలలో రైతు ధర్నాలు నిర్వహించింది.