Hanumakonda: విద్యార్థినిపై కళాశాల ఛైర్మన్ లైంగిక వేధింపులు
Hanumakonda: హనుమకొండ జిల్లా భీమారం శ్రీ చైతన్యకాలేజీలో ఘటన
Hanumakonda: విద్యార్థినిపై కళాశాల ఛైర్మన్ లైంగిక వేధింపులు
Hanumakonda: హనుమకొండ జిల్లా భీమారంలో ఇంటర్ విద్యార్థినిల పట్ల.. అసభ్యంగా ప్రవర్తించిన కాలేజీ ఛైర్మన్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. శ్రీ చైతన్య కాలేజీ ఛైర్మన్ సురేందర్ గౌడ్ గత కొన్ని రోజులు విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు నమోదైంది. 5 రోజుల క్రితం కల్లు తాగాలని మైనర్ విద్యార్థినిలపై ఒత్తిడి తెచ్చాడని.. పలు సందర్భాల్లో బూతులు తిడుతూ విద్యార్థినిలను హింసించేవాడని విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు.
కాలేజీ హాస్టలో అర్ధరాత్రి సమయాల్లో గదిలోకి వచ్చి.. తల్లిదండ్రులు వచ్చారని.. బయటికి రావాలని.. ఇబ్బందిపెట్టేవాడని విద్యార్ధినిలు తెలిపారు. హాస్టల్ ఉండే.. ట్యూటర్‌ను సైతం తిడుతూ.. విద్యార‌్థినిలను తన గదికి పంపాలని ఒత్తిడి చేసేవాడని వివరించారు. జీతాలు ఇస్తున్నా.. కాబట్టి తాను చెప్పిన పనిచేయాలని అరిచేవాడని.. ట్యూటర్లు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు ఛైర్మన్ వికృత చేష్టలు భరించిన విద్యార్థినిలు తెగించి.. రోడ్డెక్కారు. వెంటనే ఛైర్మన్‌ను తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.