Revanth Reddy: విద్యుత్ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
Revanth Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Revanth Reddy: విద్యుత్ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
Revanth Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, విద్యుత్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల స్థితిగతులు, డిమాండ్, కొనుగోళ్లు, బకాయిలు తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. విద్యుత్ రంగంపై ఆ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం అనంతరం గురువారం నిర్వహించిన మంత్రివర్గ తొలి సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై వాడీవేడి చర్చ జరిగింది. విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారని తెలుస్తోంది.