Kumari Aunty: కుమారి ఆంటీకి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు..!

Kumari Aunty: కుమారి ఆంటీకి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు..!

Update: 2024-01-31 07:11 GMT

Kumari Aunty: కుమారి ఆంటీకి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు..!

Kumari Aunty: హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేసుకునే కుమారి అనే మహిళ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయింది. రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో ఎక్కడ చూసినా ఆమెనే కనిపించింది. గత కొన్నేళ్లు నుంచి ఈమె షాప్‌ నడిపిస్తూ జీవనం సాగిస్తోంది. తాజాగా యూట్యూబ్‌ ఛానెల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశారు. దీంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు. దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య వాటిల్లింది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి.. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చిచెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు. దీంతో ఆమె తమ పొట్ట కొడుతున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు.

కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కుమారి ఫుడ్‌ స్టాల్‌ను యధావిధిగా కొనసాగించాలని డీజీపీ.. MAUD అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని..ప్రజా పాలనలో ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దని సూచించారు. త్వరలో కుమారి ఫుడ్‌ స్టాల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సందర్శిస్తారని సీఎంవో తెలిపింది. 

Tags:    

Similar News