Yadagirigutta: యాదాద్రి ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

Maha Kumbhabhishekam At Yadadri Temple: యదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మహా కుంభాబిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

Update: 2025-02-23 08:09 GMT

Yadagirigutta: యాదాద్రి ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

Maha Kumbhabhishekam At Yadadri Temple: యదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మహా కుంభాబిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభించి స్వామి వారికి అంకితం చేశారు. సీఎం దంపతలులు పంచకుండాత్మక మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆలయ అంతరాలయం మాడ విధీల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వామనామలై పీఠాధిపతి సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వర్ణయ పంచతల విమాన గోపురం దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకు ముందు యాదాద్రి ఉత్తర రాజగోపరపు నుండి ప్రధాన ఆలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రవేశించారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయఅర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయంతో స్వాగతం పలికారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News