Revanth Reddy: ప్రజల ఆకాంక్షను గౌరవిస్తు ఈ నిర్ణయం తీసుకున్నాం

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2025 రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Update: 2025-12-09 08:47 GMT

Revanth Reddy: ప్రజల ఆకాంక్షను గౌరవిస్తు ఈ నిర్ణయం తీసుకున్నాం

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2025 రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి గల కారణాన్ని, ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ తాము కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన రోజు. ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ ఈ రోజును తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా నిర్ణయించాం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది రాష్ట్ర అస్తిత్వాన్ని, సంస్కృతిని గౌరవించడంలో తమ ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ లక్ష్యాన్ని త్వరలో సాధిస్తామని ఆయన సూచించారు.

Tags:    

Similar News