నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
CM KCR: ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల ఎఫెక్ట్‌పై సీఎం కేసీఆర్ ఆరా తీసే అవకాశం
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
CM KCR: నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్‌తో నిన్న జరగాల్సిన సమావేశం ఇవాళ్టికి వాయిదా పడింది. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎఫెక్ట్‌పై సీఎం కేసీఆర్ ఆరా తీసే అవకాశం ఉంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అసమ్మతి సమావేశాలపై నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ కాంతారావు, ఎమ్మెల్యేలు హరిప్రియ, మచ్చా నాగేశ్వరరావు హాజరుకానున్నారు.