CM KCR: ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: BRS పార్టీ కార్యాలయం, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభం

Update: 2023-08-23 02:17 GMT

CM KCR: ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన 

CM KCR: ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా సీఎం మెదక్ చేరుకోనున్నారు. ముందుగా ఆయన ఒంటి గంటకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, అనంతరం ఎస్పీ కార్యాలయంతో పాటు సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.

అక్కడే వికలాంగులకు 4,016 రూపాయల పెన్షన్‌ పంపిణీని ప్రారంభిస్తారు. బీడీ కార్మికులకు అనుసంధానంగా పని చేస్తున్న ప్యాకర్లకు కూడా పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు మెదక్ నుంచి కేసీఆర్ ప్రకటించనున్నారు. మూడున్నర గంటలకు మెదక్ సీఐఎస్ ఆవరణలో జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని పూరిస్తారు. 115 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన తర్వాత జరుగుతున్న మొదటి సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News