Khammam: ఈనెలలో ఖమ్మంలో సీఎం కేసీఆర్ పర్యటన
Khammam: 5లక్షల మందితో 100 ఎకరాల్లో సభకు సన్నాహాలు
Khammam: ఈనెలలో ఖమ్మంలో సీఎం కేసీఆర్ పర్యటన
Khammam: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ నెల ఖమ్మంలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి మంత్రి పువ్వాడ పరిశీలించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభించే కలెక్టరేట్‌ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం సభ నిర్వహణ కోసం నిర్దేశించిన స్థలాన్ని పరిశీలించారు. 5 లక్షల మందితో 100 ఎకరాల్లో నిర్వహిస్తున్న సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లు హాజరుకానున్నారు.