ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు : సీఎం కేసీఆర్‌

Update: 2019-07-22 08:32 GMT

చింతమడక పర్యటన సందర్భంగా గ్రామస్తులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నెల రోజుల్లో చింతమడక గ్రామస్తులకు చింత లేకుండా చేస్తానని కేసీఆర్ హామి ఇచ్చారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల విలువైన ప్రయోజనం చేకూరుస్తామని హామి ఇచ్చారు. చింతమడకతో పాటు గూడరు, దుబ్బాక, తోర్నాల, పున్నూరుగ్రామాల ప్రజలకు ఉచిత కార్పోరేట్ వైద్యంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఆరు నెలల్లోపు అన్ని వసతులు కల్పిస్తామని కేసీఆర్ హామి ఇచ్చారు. ప్రతి గ్రామంలోని ప్రజల హెల్త్ ప్రోఫైల్ తయారు చేయిస్తామన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆషాడ మాసంలో అందరితో కలిసి గృహ ప్రారంభోత్సవంలో పాల్గొంటానంటూ కేసీఆర్ ప్రకటించారు. గ్రామస్తులంతా కలిసి, మెలిసి ఐక్యమత్యంగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించి దేశానికి ఆదర్శంగా నిలవాలంటూ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News