ఆర్టీసీ సమ్మెపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష
-ఆర్టీసీ సమ్మెపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష -మధ్యాహ్నం గం.3లకు ఉన్నతాధికారులతో సమావేశం -ఆర్టీసీ అద్దె బస్సుల నోటిఫికేషన్, రూట్ల ప్రైవేటీకరణపై జరగనున్న చర్చ -ఉద్యోగుల నియామకం, మార్గ దర్శకాలు రూపొందించేందుకు సమావేశం
ఆర్టీసీ సమ్మెపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల నోటిఫికేషన్, రూట్ల ప్రైవేటీకరణ, ఉద్యోగుల నియామకం, మార్గ దర్శకాలు రూపొందించేందుకు సమావేశం జరగనుంది. ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. విధులకు హాజరుకాని ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించారు. ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇకపై ఆర్టీసీ- ప్రైవేట్ భాగస్వామ్యంతో బస్సులు నడుస్తాయని, ఆర్టీసీ నడిపే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.