Redya Naik: ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు

Redya Naik: ఎన్నికల్లో పని చేసే వారికే ఓటు వేయాలి

Update: 2023-09-04 14:24 GMT

Redya Naik: ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు

Redya Naik: దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో పని చేసే వారికే ఓటు వేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా గూడురు మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో రెడ్యా నాయక్ పాల్గొన్నారు. గుండంరాజంపల్లి గ్రామంలో మహిళలు బతుకమ్మలు, బోనాలు, కోలాటాల నృత్యాలతో స్వాగతం పలికారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags:    

Similar News