జ్వరంతో బాధపడుతున్న మంత్రి కేటీఆర్.. మంత్రి హరీష్‌కు ప్రగతిభవన్ నుంచి ఫోన్ కాల్..
Harish Rao: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు.
జ్వరంతో బాధపడుతున్న మంత్రి కేటీఆర్.. మంత్రి హరీష్‌కు ప్రగతిభవన్ నుంచి ఫోన్ కాల్..
Harish Rao: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు. గాంధీ హాస్పిటల్‌లో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా హరీష్‌రావుకు ప్రగతిభవన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో.. ఆయన గాంధీ హాస్పిటల్‌కు వెళ్లకుండా.. ప్రగతిభవన్‌కు వెళ్లారు. అనంతరం.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మోడీ కామెంట్స్, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, విపక్షాల ఆరోపణలు, ఎన్నికల స్ట్రాటజీతో పాటు.. ఎన్నికల షెడ్యూల్, ప్రచారం, మేనిఫెస్టో తుది మెరుగులు, మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటనపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.