ప్రగతిభవన్‌లో ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సమీక్ష...ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చ

-ప్రగతిభవన్‌లో కేసీఆర్ కీలక సమావేశం -ఆర్టీసీ సమ్మెపై మరోసారి కేసీఆర్ సమీక్ష -మంత్రులు, అధికారులతో సమావేశం -ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనే ప్రధానంగా చర్చ ఆర్టీసీ సమగ్ర విధానంపై చర్చిస్తోన్న కేసీఆర్‌ -సీఎంకు రిపోర్ట్ అందజేసిన ఆర్టీసీ ఎండీ -యుద్ధప్రాతిపదికన కొత్త నియామకాలు -షరతులతో కొత్త సిబ్బంది నియామకం -15రోజుల్లో సాధారణస్థితికి తీసుకురావాలని నిర్ణయం

Update: 2019-10-07 11:29 GMT

ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సమావేశమైన కేసీఆర్ ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అద్దె బస్సులు, ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు, కొత్త సిబ్బంది నియామకం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అయితే, కార్మికులతో ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని ప్రకటించిన కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

ఆదివారం సమావేశానికి కొనసాగింపుగానే కేసీఆర్ ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యుద్ధప్రాతిపదికన కొత్త సిబ్బంది నియామకంపైనే కేసీఆర్ దృష్టిపెట్టారు. అలాగే, కొత్తగా తీసుకోబోయే సిబ్బందిని షరతులతో తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. కేవలం పదిహేను రోజుల్లోనే మొత్తం ఆర్టీసీ వ్యవస్థను సాధారణ స్థితికి రావాలని ఉన్నతాధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.

Tags:    

Similar News