మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ ప్రారంభం

Mahabubabad: ఆక్సిజన్‌ బ్యాంక్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

Update: 2021-06-08 10:48 GMT

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు (ఫైల్ ఇమేజ్)

Mahabubabad: కోవిడ్‌ కష్టకాలంలో సినీనటుడు చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ప్రారంభించడం.. అభినందించదగ్గ విషయమని అన్నారు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ బ్యాంక్‌లో 24 గంటల పాటు ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంటాయన్న శంకర్‌ నాయక్‌.. అవసరమున్నవారు ఆక్సిజన్‌ సిలిండర్లను తీసుకెళ్లొచ్చని తెలిపారు. ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి, కరోనా బాధితులకు అండగా నిలిచిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌.

Tags:    

Similar News