కేసీఆర్‌తో కలిసి అల్పాహారం తీసుకోనున్న ముఖ్యమంత్రులు
* బేగంపేట నుంచి యాద్రాద్రికి హెలికాప్టర్లో ప్రయాణం
కేసీఆర్‌తో కలిసి అల్పాహారం తీసుకోనున్న ముఖ్యమంత్రులు
Khammam: ఖమ్మంలో జరగనున్న భారత రాష్ట్రసమితి ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు వచ్చిన పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపట్లో ప్రగతి భవన్ చేరుకోనున్నారు. నిన్ననే చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ మఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రగతి భవన్ చేరుకుంటారు. కేసీఆర్‌తో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకుని హెలికాప్టర్లో యాదాద్రి వెళ్తారు.