Nallala Odelu: సొంతగూటికి నల్లాల ఓదెలు దంపతులు
Nallala Odelu: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.
Nallala Odelu: సొంతగూటికి నల్లాల ఓదెలు దంపతులు..!
Nallala Odelu: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మళ్లీ టీఆర్‌ఎస్ గూటికి చేరారు. గత కొద్ది రోజుల కిందట ఓదెలు తన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మితో కలిసి టీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ఆయన మళ్లీ టీఆర్‌ఎస్ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఓదెలు దంపతులు టీఆర్‌ఎస్‌లో జాయిన్ అయ్యారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్.
ఓదెలు తన రాజకీయ జీవితాన్ని టీఆర్‌ఎస్‌తో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2010లో రాజీనామా చేసి.. మరోసారి గెలుపొందారు. 2014లోనూ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.