GHMC కౌన్సిల్ సమావేశంలో రసాభాస.. ఓ వైపు బీజేపీ వర్సెస్ ఎంఐఎం..మరోవైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఓ వైపు BJP, MIM నేతల మధ్య వాగ్వాదం.. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనలతో సమావేశం వాడివేడిగా సాగింది.
GHMC కౌన్సిల్ సమావేశంలో రసాభాస.. ఓ వైపు బీజేపీ వర్సెస్ ఎంఐఎం..మరోవైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఓ వైపు BJP, MIM నేతల మధ్య వాగ్వాదం.. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనలతో సమావేశం వాడివేడిగా సాగింది. వందేమాతరం పాడితేనే దేశంలో ఉండాలని బీజేపీ కార్పొరేటర్లు వ్యాఖ్యలు చేయడంతో.. బీజేపీకి వ్యతిరేకంగా MIM కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. టేబుల్స్ ఎక్కి నిరసన తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియంని చుట్టుముట్టారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.