Chandrababu: మంచి మనిషిని కోల్పోయాం.. గద్దర్ ఇంట్లో చంద్రబాబు
Chandrababu Naidu: కుటుంబానికి అండగా ఉంటానని హామీ
Chandrababu: మంచి మనిషిని కోల్పోయాం.. గద్దర్ ఇంట్లో చంద్రబాబు
Chandrababu Naidu: అల్వాల్ లోని గద్దర్ కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు పరామర్శించారు. గద్దర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. గద్దర్ కుమారుడు సూర్యంతో మాట్లాడి కుటుంబ వివరాలని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అవిధాలా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గద్దర్ ఒక వ్యక్తి కాదు.. ఆయనొక వ్యవస్థ అన్నారు. . ప్రజాచైతన్యం అనగానే గుర్తొచ్చే పేరు గద్దర్ అన్నారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు.