Fire Accident: కడ్తాల్‌లో ప్రమాదం.. మంటల్లో పూర్తిగా దగ్ధమైన కారు
Fire Accident: రంగారెడ్డి జిల్లాలో కారులో మంటలు చెలరేగాయి. కడ్తాల్ మండలం మక్దతమదారాం శివారులో ఘటన చోటు చేసుకుంది.
Fire Accident: కడ్తాల్‌లో ప్రమాదం.. మంటల్లో పూర్తిగా దగ్ధమైన కారు
Fire Accident: రంగారెడ్డి జిల్లాలో కారులో మంటలు చెలరేగాయి. కడ్తాల్ మండలం మక్దతమదారాం శివారులో ఘటన చోటు చేసుకుంది. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండా నుంచి నలుగురు యువకులు కారులో హైదారాబాద్ వెళ్తున్న క్రమంలో ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ గుర్తించాడు. వెంటనే కారులో ఉన్న నలుగురు యువకులను కారు నుంచి కిందకు దింపిన వెంటనే కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేశారు.