Jubilee Hills: మహిళను ఢీకొన్న కారు..2నెలల పసికందు మృతి
Jubilee Hills: కారుపై బోదన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండడంతో వివాదం
Jubilee Hills: మహిళను ఢీకొన్న కారు..2నెలల పసికందు మృతి
Jubilee Hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. రెండు నెలల పసికందును ఎత్తుకొని రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె చేతిలో ఉన్న బాలుడు..తలకు తీవ్రగాయమై స్పాట్‌లోనే మృతిచెందాడు. అయితే మహిళను ఢీకొట్టిన కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండడంతో వివాదం చెలరేగుతోంది. దీనిపై ఎమ్మెల్యే షకీల్ స్పందిస్తూ ఈ ప్రమాదానికి తనకు ఎలాంటి సంబంధంలేదని ప్రకటించాడు. అయితే కారు ఎవరిదనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజ్ ఆథారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.