Hyderabad: BMW కారు బీభత్సం.. మల్లేష్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి

Hyderabad: మరో ఇద్దరికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Update: 2023-12-17 02:14 GMT

Hyderabad: BMW కారు బీభత్సం.. మల్లేష్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి

Hyderabad: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. విజయవాడ జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన BMW కారు.. చింతలకుంట పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఆగివున్న మరో కారుతో పాటు.. బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మల్లేష్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకోండి గ్రామానికి చెందిన మల్లేష్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ నందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి హబ్సిగూడకు నందన్‌ వెళ్తున్నట్టు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News