నిజామాబాద్ మెడికల్‌ కాలేజీలో వెలుగుచూస్తున్న సంచలన విషయాలు

Update: 2019-09-04 14:41 GMT

నిజామాబాద్ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. మెడికల్ కాలేజీలో వ్యవహారాలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన నివేదికను డీఎంఈకి అందజేసింది. కాలేజీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని కొందరు బయటి వ్యక్తుల విద్యార్థులకు అలవాటు చేస్తున్నారని నివేదికలో వెల్లడైంది. చాలామంది విద్యార్థులు మధ్యం మత్తులో తూలుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా కమిటీ నివేదిక పరిపాలనా లోపాలు ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాలేజీ పరిపాలనను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సూచించింది.

తనను కొందరు సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేస్తున్నారంటూ తల్లిదండ్రులతో కలిసి ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీంతో తక్షణమే స్పందించిన డీఎంఈ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదికలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులను హాస్టల్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News