TS Cabinet Meeting:రెండు మూడు రోజుల్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం.

TS Cabinet Meeting: కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం

Update: 2024-03-09 09:54 GMT

TS Cabinet Meeting:రెండు మూడు రోజుల్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం.

TS Cabinet Meeting: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ రానుండటంతో.. కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు.. పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈనెల 11న భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించనుండగా.. ఈ పథకానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. హైకోర్టు సూచనల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News