Gangula Kamalakar: దోషులను శిక్షించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం

Gangula Kamalakar: కరీంనగర్ జిల్లా తణుగులలో మానేరు వాగుపై చెక్‌ డ్యాంను దుండగులు పేల్చేశారని..

Arun Chilukuri
Published on: 28 Nov 2025 2:34 PM IST
Gangula Kamalakar: దోషులను శిక్షించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం
X

Gangula Kamalakar: దోషులను శిక్షించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం

Gangula Kamalakar: కరీంనగర్ జిల్లా తణుగులలో మానేరు వాగుపై చెక్‌ డ్యాంను దుండగులు పేల్చేశారని.. దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్‌ఎస్ నేతలు. ఇసుక మాఫియానే బాంబులు పెట్టి చెక్‌డ్యాంను పేల్చేశారని ఆరోపించారు మాజీమంత్రి గంగుల కమలాకర్. కలెక్టర్‌ను కలిసి నిజనిర్ధారణ చేయాలని కోరామని ఆయన కోరారు. దోషులను శిక్షించే వరకు నిరంతం పోరాటం చేస్తానని తెలిపారు. దేశ, రాష్ట్ర సంపదని విధ్వంసం చేస్తానంటే ఊరుకోనని గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story