దిశ కేసులో నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలింపు

Update: 2019-12-09 16:42 GMT
Disha case

దిశ నిందితుల మృతదేహాలను సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక ఏసీ అంబులెన్స్ లో మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోలీస్ బందోబస్తు మధ్య మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలోకి తరలించారు. ముందుగా ఏర్పాటు చేసిన నాలుగు ఫ్రీజర్ బాక్స్ లలో మృతదేహాలను వుంచి మార్చురీలో భద్రపరిచారు. భద్రతాకారణాల రీత్యా గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా పడింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం..ఇదే కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. దిశ ఎన్ కౌంటర్ విచారణలో సీనియర్ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డిని మధ్యవర్తిగా నియమించింది. ఈ కేసు కేసు విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.

మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో ఉన్న నిందితుల మృతదేహాలను సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.  

Tags:    

Similar News