ఇవాళ, రేపు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశాలు

BJP: హాజరుకానున్న సునీల్ బన్సల్, తరుణ్‌ చుగ్, కిషన్‌రెడ్డి

Update: 2024-01-07 02:02 GMT

ఇవాళ, రేపు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశాలు

BJP: ఇవాళ, రేపు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సునీల్ బన్సల్, తరుణ్‌ చుగ్, కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జాతీయ నాయకత్వం.. పార్లమెంట్ ఎన్నికల కోసం కమిటీలను వేయనుంది. అలాగే.. సంస్థాగతంగా మార్పులు చేర్పులపైనా ఈ భేటీలో చర్చించనున్నారు నేతలు. కొంతమంది జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలను.. కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది కమలం పార్టీ.

Tags:    

Similar News