బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది.. ఆయన తల్లి గంగాపురం అండాలమ్మ మృతిచెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేకువజామున 2 గంటలకు కన్నుమూశారు. ఉదయం ఆస్పత్రి నుండి పార్థివదేహాన్ని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి తీసుకెళ్లి, మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. భర్త మరణానంతరం ఆమె తిమ్మాపూర్‌లోనే ఉన్నారు. స్వామిరెడ్డి, ఆండాలమ్మకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. చివరి సంతానం కిషన్ రెడ్డి. చికిత్స