BJP: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం
BJP: హాజరైన డీకే అరుణ, లక్ష్మణ్, జితేందర్‌రెడ్డి, మురళీధర్‌రావు, పొంగులేటి
BJP: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం
BJP: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కమలం పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల కమిటీ సమావేశం అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీకి డీకే అరుణ, లక్ష్మణ్, జితేందర్‌రెడ్డి, మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికతో పాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా ఈ నెల 20వ తేదీ నుంచి బీజేపీ బస్సు యాత్రలు చేపట్టనుంది. సభలు, సమావేశాలకు జాతీయ నేతలు హాజరయ్యేలా రూట్‌మ్యాప్‌పై సమావేశంలో చర్చించనున్నారు.