Raghunandan Rao: సాయంత్రంలోగా చంపేస్తాం.. ఎంపీ రఘునందన్‌కు బెదిరింపు కాల్
Raghunandan Rao: తెలంగాణలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు సంచలనంగా మారిన బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది.
Raghunandan Rao: తెలంగాణలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు సంచలనంగా మారిన బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. పీపుల్స్‌వార్ మావోయిస్టు పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి, "ఈ సోమవారం సాయంత్రం వరకు నిన్ను చంపేస్తాం" అంటూ హెచ్చరించాడు.
ఈ ఘటన మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ హాజరైన సమయంలోనే ఈ కాల్ వచ్చింది. ఫోన్‌ను ఎంపీ పీఏ లిఫ్ట్ చేయగా, కాల్‌లో ఉన్న వ్యక్తి తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునని తెలిపి, ప్రాణ హానికి పాల్పడతానని బెదిరించాడు.
ఈ విషయాన్ని వెంటనే డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులకు ఎంపీ రఘునందన్ తెలియజేశారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో పోలీసులు ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. కాల్‌ను ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.