రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంప ఛెళ్లుమనిపించిన ఈటల రాజేందర్... ఎందుకంటే?
ఈటల రాజేందర్ మేడ్చల్ జిల్లా ఏకశిలానగర్ లో రియల్ ఏస్టేట్ వ్యాపారిపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చెంపపై కొట్టారు.
BJP MP Etela Rajender thrashes real estate person: మేడ్చల్ జిల్లా ఏకశిలానగర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకున్నారు. ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా ఆయనపై దాడికి దిగారు. ఏకశిలానగర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి స్థానికులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ ఈటల ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో ఈటెల రాజేందర్ ఏకశిలానగర్ లో పర్యటించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి తమను వేధిస్తున్నారని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహంతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంప ఛెళ్లుమనిపించారు. ఎంపీతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు. స్థానికంగా ఉన్న ఇంటి యజమానులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారని ఈటల మండిపడ్డారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ స్థానికుల ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
అయితే ఈ విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వాదన మరోలా ఉంది. ఈ వివాదానికి కారణమైన భూములను మేం కొనుగోలు చేసి దక్కించుకున్నవే కానీ కబ్జా చేసినవి కాదని వారు అంటున్నారు. ఏదేమైనా రియల్ ఎస్టేట్ దళారిపై బీజేపి ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికుల వాదన ఒకలా ఉంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వాదన మరొకలా ఉండటంతో మున్ముందు ఈ ఘటన ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్ చుట్టుపక్కల పేదల ఖాళీ స్థలాలను రియల్ ఏస్టేట్ వ్యాపారులు, వారి ఏజంట్లు, అధికారుల అండదండలతో దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.బాధితులు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదన్నారు.
అరుంధతినగర్, బాలాజీనగర్ , జవహర్ నగర్ లో 40, 60 గజాల్లో పేదల కట్టుకున్న ఇళ్లను తాను స్వయంగా చూసిన విషయాన్ని ఆయన మీడియాకు వివరించారు.రెవిన్యూ మంత్రి, కలెక్టర్ తో ఈ విషయమై తాను మాట్లాడినా కూడా సమస్య పరిష్కారం కాలేదన్నారు.