అసెంబ్లీకి రాని ఉన్న ఒక్క బీజేపీ ఎమ్మెల్యే

Update: 2019-09-15 06:19 GMT

బయట ఎంత లొల్లి చేస్తే ఏం లాభం? శంఖంలో పోస్తేనే తీర్థమన్నట్టు అసెంబ్లీలో మాట్లాడితేనే నిరసన సరిగ్గా అక్కడే మిస్ అయిపోతోంది ఆ పార్టీ. సభలో ఉన్నది ఒకే ఒక్కడు పార్టీ వాణి వినిపించాలన్నా, వేడి పెంచాలన్నా ఆ ఒక్కడే చేయాలి. అధికార టిఆర్ఎస్ ను ప్రశ్నించాలన్నా, ప్రతిపక్ష కాంగ్రెస్ కి సమాధానం ఇవ్వాలన్నా ఆజన్మ శత్రువు మజ్లిస్ తో సై అనాలన్నా అన్నిటికీ ఏక్ నిరంజన్ కానీ ఇప్పుడా ఒక్కడూ సభకు రాకపోవడంతో సభలో బీజేపీ మిస్ అయిపోతోంది.

తెలంగాణ లో బలపడి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కలలు కంటున్న ఆ పార్టీకి ప్రజావాణి వినిపించాల్సిన చోట మాత్రం వాయిస్ కరువయ్యింది. ఉన్నదే ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే అంటే దానికి తోడు లాంగ్వేజ్ ప్రాబ్లమ్. దీంతో కమలం పార్టీ కి సభలో బలమైన వాయిస్ వినిపించే వారు లేక ఇబ్బంది పడుతోంది.

ఉన్న ఒకే ఒక్క ఎం ఎల్ ఏ కూడా బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆబ్సెంట్ అవ్వటం హాట్ టాపిక్ గా మారింది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజూ, బడ్జెట్ పై చర్చ సందర్భంలో నూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సభకు రాలేదు. దీంతో బీజేపీ వాయిస్ సభలో వినిపించకుండా పోయింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై బయట ఎంత పోరాటం చేసినా శాసన సభలోనూ పార్టీ స్వరం బలంగా వినిపించినప్పుడే ప్రజల నుండి ఆదరణ పొందేది. కానీ అసలైన చోటే ఆ పార్టీ వీక్ గా మారటం తెలంగాణ లో బలపడాలనుకుంటున్న ఆ పార్టీకి మైనస్సే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సభలో ఉండి తన వాయిస్ వినిపించి ఉండగలిగితే బాగుండేదని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. ముమ్మాటికీ ఇది బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించే విషయమేనని దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  

Tags:    

Similar News