సర్పంచులపై ప్రభుత్వం కేసుల పెడితే ఫ్రీగా వాదిస్తాం

సర్పంచులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడితే న్యాయవాదిగా ఉచితంగా వాదిస్తానని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హుజూర్‎నగర్ ఎన్నికలో తెలంగాణ సర్పంచులందరూ నామినేషన్ వేయాని పిలుపునిచ్చారు.

Update: 2019-09-29 12:01 GMT

సర్పంచులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడితే న్యాయవాదిగా ఉచితంగా వాదిస్తానని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఆర్టికల్ 370 రద్దుపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా హుజూర్‎నగర్ ఎన్నికలో తెలంగాణ సర్పంచులందరూ నామినేషన్ వేయాని పిలుపునిచ్చారు. తెలంగాణ సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు భూమన్న యాదవ్ ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ మంత్రలు రిబ్బన్ల కత్తిరించేందుకే ఉన్నారని ఎద్దేవా చేశారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని ప్రకటించామని గుర్తుచేశారు. కశ్మీర్ స్వయంప్రతిపతి గల అధికరణ 370ని చెప్పినట్లుగానే రద్దు చేసి చూపించామని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News