AP-TS Water Dispute: జలజగడంపై బీజేపీ ఫోకస్.. కేంద్రానికి నివేదిక..
AP-TS Water Dispute: తెలుగు రాష్ట్రాల నీటి వివాదంతో బీజేపీ పకడ్భందీగా కసరత్తు చేస్తోంది.
AP-TS Water Dispute: జలజగడంపై బీజేపీ ఫోకస్.. కేంద్రానికి నివేదిక..
AP-TS Water Dispute: తెలుగు రాష్ట్రాల నీటి వివాదంతో బీజేపీ పకడ్భందీగా కసరత్తు చేస్తోంది. ఇరురాష్ట్రాల ప్రాజెక్టుల వివాదాలపై బీజేపీ కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. అటు పోతిరెడ్డిపాడు ఇటు సుంకేశుల తదితర ప్రాజెక్టులపై రేగుతున్న రగడకు బీజేపీ ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించింది లేదు. జలజగడం రాజకీయ రూపు తీసుకుంటున్న తరుణంలో బీజేపీ తన విధానాన్ని తేల్చాల్సిన సమయం వచ్చింది. దాంతో ఉమ్మడి ప్రాజెక్టులను సామరస్యపూర్వకంగా పరిష్కంచే విధంగా అడుగులు వేస్తోంది. దాంతో ఎల్లుండి ఇరు రాష్ట్రాల బీజేపీ నేతలు సమావేశం కానున్నారు.
రాయలసీమ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్డీఎస్ కుడి కాల్వ, సుంకేశుల, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, తరుణ్ ఛుగ్, సీమా బీజేపీ పదాధికారులు ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ అద్యక్షులు పాల్గొననున్నారు. జలజగడం పై చర్చించి తమ నివేదికను ప్రధాని మోడీకి అందించనున్నారు.