కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి

Hyderabad police: కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై బైక్ రైడర్ బీరు బాటిల్ తీసుకుని తలపై దాడికి పాల్పడ్డారు.

Update: 2025-03-25 08:25 GMT

కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి 

Attack on constable Srikanth: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో శ్రీకాంత్ అనే కానిస్టేబుల్‌పై గుర్తుతెలియని వ్యక్తి బీరు బాటిల్‌తో దాడి చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెం. 12 ఒమెగా హాస్పిటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, కానిస్టేబుల్ శ్రీకాంత్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

టోలిచౌకి నుండి బంజారాహిల్స్ వైపు బైక్‌పై వస్తున్న వ్యక్తి ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టారు. దాంతో కారులో ఉన్న వ్యక్తికి, బైక్ రైడర్ కు మధ్య వాగ్వాదం తలెత్తింది. అదే సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో డ్యూటీ చేసే కానిస్టేబుల్ శ్రీకాంత్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. కారు డ్రైవర్, బైక్ రైడర్ మధ్య గొడవ జరుగుతుండటం చూసి వారిని వారించే ప్రయత్నం చేశారు. కానీ ఆ క్రమంలోనే శ్రీకాంత్‌పై బైక్ రైడర్ బీరు బాటిల్ తీసుకుని తలపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ శ్రీకాంత్‌కు ఓవైపు తలకు రక్తం కారుతున్నప్పటికీ.. దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి అక్కడి నుండి పరారయ్యారు. బైక్ నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని ఖాజాగా పోలీసులు గుర్తించారు. పోలీసులు శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ ను పరామర్శించారు. ఈ ఘటన జరిగిన తీరును శ్రీకాంత్ నుండి అడిగి తెలుసుకున్నారు. ఒక గొడవను అడ్డుకునే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్‌ను డీసీపీ అభినందించి, ధైర్యం చెప్పారు. శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

Tags:    

Similar News