తెలంగాణ సర్కార్‎కు హైకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ నిర్మించాలన్న మంత్రి మండలి తీర్మానాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.

Update: 2019-09-17 04:37 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. అసెంబ్లీ కోసం ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై హైకోర్టు తీర్పు వెలువడించింది. కొత్త అసెంబ్లీ నిర్మాణం నిమిత్తం ఎర్రమంజిల్ లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై న్యాయస్థానం సోమవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ నిర్మించాలన్న మంత్రి మండలి తీర్మానాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. నిబంధన 13 ఏకపక్షమని అభిప్రాయపడింది. దీంతో నూతన అసెంబ్లీ నిర్మాణం నిమిత్తం ఎర్రమంజిల్ లోని పాత భవనాలను కూల్చొద్దని ఆదేశించింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు, ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మించొద్దని ఆదేశించింది.

.  

Tags:    

Similar News