Khammam: ఖమ్మం లోక్‌సభ కోసం దరఖాస్తు చేసుకోనున్న భట్టి విక్రమార్క భార్య నందిని
Khammam: గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకోనున్న మల్లు నందిని
Khammam: ఖమ్మం లోక్‌సభ కోసం దరఖాస్తు చేసుకోనున్న భట్టి విక్రమార్క భార్య నందిని
Khammam: ఖమ్మం లోక్‌సభ స్థానం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గాంధీభవన్‌కు మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని బయలుదేరారు. భారీ ర్యాలీగా ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. తొలుత ఖమ్మంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్లు నందిని కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ వచ్చి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా నాయకులను కోరనున్నారు. ఖమ్మం జిల్లా ప్రజల కోరిక మేరకు పార్లమెంట్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంటున్నట్లు మల్లు నందిని తెలిపారు. సోనియా, ప్రియాంక గాంధీలు ఖమ్మం నుంచి పోటీచేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.