ఈనెల 24న హైదరాబాద్‎లో పండుగలా బతుకమ్మ చీరల పంపిణీ

ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో చీరల పంపిణీ చేస్తామన్నారు.

Update: 2019-09-21 11:03 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ చీరలు తయారీ సిరిసిల్ల చేనేత కార్మికులకు అప్పగించి వారికి కూడా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది. కాగా.. ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో చీరల పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు చీరల పంపిణీ ప్రక్రియ కొనసాగనుందని ఆయన తెలిపారు. జీహెచ్‌ఎంసీకి 15 లక్షల 40 వేల చీరలు మంజూరయ్యాయనీ, జీహెచ్‌ఎంసీ, పౌరసరఫరాల శాఖ సమన్వయంతో చీరల పంపిణీ జరుగుతుందని మంత్రి అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో ఏ ఇబ్బందులు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అర్హులైన అందరికీచీరలు అందేలా చూడాలన్నారు. 

Tags:    

Similar News